TRINETHRAM NEWS

అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగల అరెస్టు వికారబా ద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సి‌సి‌ఎస్,వికారాబాద్ జిల్లా.ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర తేది 20.09.2024 రోజున బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 తులాల బంగారు గోలసు స్నాచింగ్ జరిగింది, 22.09.2024 రోజునవికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 తులాల బంగారం గోలసు స్నాచింగ్ జరిగింది మరియు అదే రోజున (తేది 22.09.2024) కుల్కచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బంగారు గోలసు స్నాచింగ్ చేయుటకుప్రయత్నించినారు అని పిర్యాదులు రాగా అప్పటికప్పుడే ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలలో కేసులు నమోదు చేయడంజరిగింది. జిల్లాలో రెండు రోజులలోనే 3 స్నాచింగ్ కేసులు నమోదు అవ్వగా అట్టికేసులనిందితులను గుర్తించి, అరెస్టు చేయాలని ఉద్దేశం తో ఇట్టి కేసులను ఛాలెంజ్ గాతీసుకొనిఆయా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సి‌సి‌ఎస్ ఇన్స్పెక్టర్లు బలవంతయ్య, అన్వర్ పాషా ఆద్వర్యంలో టీమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. టెక్నికల్ ఆధారాలు,ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలలో ఏర్పాటు చేసిన సి‌సి‌టి‌వి ద్వారా సేకరించిన ఆధారాలతో జిల్లాలో చైన్ స్నాచింగ్ చేసిన అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ నేరస్థులు అయిన ఎం‌డి జావిద్ మరియు ఒక మైనర్ బాలుడు ఇద్దరినీ కర్ణాటక రాష్ట్రం బిధర్ జిల్లా, హుంనాబాద్ తాలూకా లోని తేజస్ లాడ్జ్ వద్ద వికారాబాద్ సి‌సి‌ఎస్ పోలీస్ అధికారులుఅదుపులోకితీసుకోవడం జరిగింది.
నేరం చేయు విధానము :నేరస్థులు అయిన ఎం‌డి జావిద్ మరియు మైనర్ బాలుడు స్నాచింగ్ చేయడానికి ముందుగా తాము దొంగతనం చేసిన ద్విచక్ర వాహనం పైన గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలుసేవించి, తమ దగ్గర పెప్పర్ స్ప్రే మరియు ఒక వేట కొడవలి ని వెంటపెట్టుకుంటారు.ఇట్టి నేరస్తులు వాకింగ్ చేసే మహిళలను ,ఆరుబయట కూర్చున్న మహిళ లను, కిరాణా కొట్టులలో ఉన్న మహిళ లనే లక్ష్యంగా చేసుకుంటారు. వీరిలో ఒక నేరస్తుడు బైక్ నడిపిస్తాడు ఇంకొక నేరస్తుడు వెనకాల కూర్చొని ఒంటరిమహిళలను టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్న బంగారం గొలుసులను స్నాచింగ్ చేసుకొని అక్కడి నుండి బైక్ మీద పారిపోతారు. ఎవరైనా వారిని ఎదిరిస్తే వారి కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి, వేట కొడవలితో బయపెట్టిపారిపోతారు. ఇట్టి నేరస్తులు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే దొంగతనాలకు పాల్పడుతారు. ఆదివారం రోజున ఎలాంటి నేరాలకు పాల్పడరు. A1 నేరస్థుడు అయిన ఎం‌డి జావిద్ దొంగతనానికి వచ్చే ప్రతి సారి తన వెంబడి ఆరిఫ్, మేరాజ్, అర్షాద్, రశీద్ పటేల్, ఆఫ్రోజ్, వజీద్, సమీర్, రవూఫ్, అర్బస్ లలో ఎవరినైనా ఒకరిని తోడుగా తీసుకొని వచ్చి నేరాలకు పాల్పడుతాడు. A1 నిందితుని పైన కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ మరియు రంగారెడ్డి జిల్లాలలో మొత్తం కలిపి సుమారు 150 కేసులు నమోదై ఉన్నాయి.

పోలీసుల నుండి తప్పించుకొనే విధానం:నేరస్థులు నేరాలకుపాల్పడిన తర్వాత చాలా చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. ఇన్ని నేరాలకు పాల్పడి కూడా కేవలం రెండు సార్లు (ఇది రెండవ సారి ) మాత్రమే పోలీసులకు చిక్కినారు. నేరస్తుడు నేరం చేసిన వెంటనే పోలీసులకు చిక్కకుండా వెంటనే తాము వాడిన బైక్ యొక్క నెంబర్ ప్లేట్ మరియు తాము వేసుకున్న బట్టలనుమార్చేస్తారు. టెక్నికల్ గా కూడా పోలీస్ లకు చిక్కకుండా నిందితులు ఎప్పటికప్పుడు తన సెల్ ఫోన్ లు, సిమ్ కార్డ్స్ మార్చుకుంటూ, తమ సెల్ ఫోన్ నుండి ఎవరికి కూడా డైరెక్ట్ గా కాల్స్ చేయకుండా జాగ్రత్తపడుతారు. దారిన పోయే అమాయకులతో మంచిగామాట్లాడుతూ వారి మొబైల్ ఫోన్ తీసుకొని వారి ఫోన్ నెంబర్ తో నేరస్థులు తమ సెల్ ఫోన్ లో Whatsapp ఏర్పాటు చేసుకొని వాడుతారు. తమ సెల్ ఫోన్ లోని ఇంటర్నెట్ తో కాకుండా తమ ఇతర మొబైల్ లోని హాట్ స్పాట్ తో వీళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొనివాడుతారు. మరియు నేరాలు చేయడానికి వచ్చే ముందు 100 కిలోమీటర్స్ దూరంగాఉన్నప్పుడే తమ సెల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చి, నేరం చేసిన తర్వాత తిరిగి 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయి తమ సెల్ ఫోన్ లను నేరస్థులు స్విచ్ ఆన్చేసుకుంటారు. ఏ1 నేరస్తుని పైన 2ndAddl.dist.and సెషన్స్ జడ్జ్ , బిధర్ (సిట్టింగ్ at బసవకళ్యాన్) కోర్ట్ లో NBW పెండింగ్ లో ఉంది, మరియు 2020 సంవత్సరం లో నిందితుడు చర్లపల్లిజైలు(జుడిసియల్ కస్టడీ ) లో ఉన్నపుడు కరోన వ్యాది రాగ చికిస్తా కొరకు గాంధీ హాస్పిటల్ నందు అడ్మిట్ చేయగా అక్కడ ఉన్న ఎస్కార్ట్ పోలీస్ సిబ్బంది కండ్లు కప్పి, పోలీసులకు చిక్కకుండా అక్కడి నుండి పారిపోయినాడు. అప్పుడు చిలకల గూడ పోలీస్ స్టేషన్ నందు కేసు చేసి ఏ1 నేరస్థున్ని పట్టుకొని రిమాండ్ చేయగా జైలులో ఉన్నాడు. అప్పటి నుండి జైలులో ఉండి 2022 నవంబర్ లో 2nd Addl.dist.and సెషన్స్ జడ్జ్ , బిధర్ (సిట్టింగ్ at బసవకళ్యాన్) కోర్ట్ నుండి బెయిల్ తీసుకొని బయటకి రావడం జరిగింది. మళ్ళీ కోర్ట్ కు వెళ్ళాక పోవడం తో అట్టి కోర్ట్ లో NBW పెండింగ్ లో ఉంది. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా జిల్లాలోవికారాబాద్, బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది మరియు కుల్కచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేయుటకు ప్రయత్నంచేయడం జరిగింది. ఇవేకాకుండా సంగారెడ్డిజిల్లాలోని సదాశివపేట్, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలలో కూడా నిందితుడు చైన్ స్నాచింగ్ చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది.ప్రస్తుతం నిందితున్ని వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన చైన్ స్నాచింగ్ కేసులో వికారాబాద్ సి‌సి‌ఎస్ పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరుగుతుంది.
రికవరీ :నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ పి‌ఎస్ లో నమోదు అయిన కేసులో నుండి 2.5 తులాల గోల్డ్ చైన్, సదాశివపేట్ పి‌ఎస్ పరిధిలోని కేసులో 4 తులాల గోల్డ్ చైన్, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కేసులోని 3.5 తులాల గోల్డ్ చైన్ లను మొత్తం సుమారు 7,80,000/- రూపాయల విలువ గల 10 తులాలబంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరస్తుల నుండి రెండు పెప్పర్ స్ప్రే లు మరియు వెటకొడవలి లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.వికారాబాద్ జిల్లా లోని కేసుల వివరాలు :
1)బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్
తేది 20.09.2024,
క్రైమ్ నెంబర్ 123/2024, అండర్ సెక్షన్ 304 BNS. 2.5 తులాల బంగారం రికవరీ పెండింగ్, ఇట్టి బంగారాన్ని బీదర్ లోని తిరుమల జావెలర్స్ లో అమ్మినట్లు నేరస్తుడు ఒప్పుకోవడం జరిగింది.
2 కుల్కచెర్ల పోలీస్ స్టేషన్
తేది: 22.09.2024,
క్రైమ్ నెంబర్ : 127/2024, U/sec : 304 BNS. attempt 5 తులాల బంగారం గోలసు
3వికారాబాద్ పోలీస్ స్టేషన్
తేది: 22.09.2024,
క్రైమ్ నెంబర్ : 353/2024, U/sec : 304 r/w 62 BNS. (2.5 తులాల బంగారం రికవరీ
సంగారెడ్డి జిల్లాలోని కేసుల వివరాలు
1సదాశివపేట్ పోలీస్ స్టేషన్
తేది 16.07.2024,
క్రైమ్ నెంబర్ :356/2024, అండర్ సెక్షన్ 304 BNS.4 తులాల బంగారం రికవరీ
2జహీరాబాద్ పోలీస్ స్టేషన్
తేది 08.10.2024,
క్రైమ్ నెంబర్ :291/2024, అండర్ సెక్షన్ 304 BNS. 3.5 తులాల బంగారం రికవరీ
Accused details: ఏ1 ఎం‌డి,జావిద్ తండ్రి దస్తగీర్, వయస్సు : 35 సం”రాలు, R/o జహాంగీరబాద్,బండ్లగూడ, చాంద్రాయణగుట్ట,హైదరాబాద్. ఏ2 మైనర్ కావున వివరాలు ఇవ్వడం లేదు. జాగ్రతలు:
స్నాచింగ్ చేసే నేరస్తులు ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని నేరాలు చేస్తారు కావున ఒంటరిగా ఉండే మహిళలు జాగ్రతగాఉండాలని, ఒంటరిగా ఉన్నప్పుడూ తమ దగ్గరఉన్నటువంటిబంగారంఆభరణాలు కనబడకుండా జాగ్రత్తపడాలని, ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే తమ కుటుంబ సభ్యులకు గాని, తమ పరిధిలోని పోలీస్ అధికారులకు గాని తెలియజేయాలని, లేదా డైల్ 100 ద్వారా జిల్లా పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తే ఎల్లప్పుడు పోలీస్ అధికారులు జిల్లా ప్రజల కోసం అందుబాటులో ఉంటారని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.
పై కేసును ఛేదించిన పోలీసు అధికారులు సి‌సి‌ఎస్ ఇన్స్పెక్టర్లు బలవంతయ్య, అన్వర్ పాషా, HCs చెన్నయ్య గౌడ్, జయవర్ధన్, శివకుమార్, PCs క్రిష్ణ రెడ్డి, రాఘవేంధర్ రెడ్డి, అంజప్ప, రామకృష్ణ లకు రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App