
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. ఈరోజు అనగా గురువారం నాడు వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి జరుపుల లక్ష్మి (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) మరియు అందే మోహన్(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పాల్గొనడం జరిగింది.
వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆదిత్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జరుపులా లక్ష్మి మాట్లాడుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో యూత్ కాంగ్రెస్ ఏ విధంగా అయితే కష్టపడ్డారు అదే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉంటామని, అలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ఆనంద రోజుల్లో ముందు ముందు ప్రవేశ పెట్టబోయే పథకాలను కూడా ప్రతిదానిని ప్రజల వద్దకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యూత్ కాంగ్రెస్ మరింత కృషి చేస్తుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
