TRINETHRAM NEWS

District Governor N Venkateshwar Rao is no match for Ramagundam Lions Club

కృత్రిమ అవయవాల పంపిణీ..

పేదవారిని ఆదుకోవడంలో

రామగుండం లయన్స్ క్లబ్ కు సాటి ఎవరు లేరుడిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వర్ రావు

లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో

గోదావరిఖని లయన్స్ భవన్లో ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వర్ రావు హాజరై అభాగ్యులు, బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ సెక్రటరీ వి ఎల్లప్ప ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన

ఈ కార్యక్రమానికి ముందుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ,

ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గ్రామాలు, వీధులే కాకుండా ఎక్కడైనా నిరుపేదలు ఉన్న ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో రామగుండం లయన్స్ క్లబ్ ముందుకు పోతుందని అలాగే నిత్యం అన్న ప్రసాదం, ఉచిత కంటి ఆపరేషన్లు తదితర సేవలతో పాటు కాళ్లు, చేతులు కోల్పోయిన బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడంలో రామగుండం లైన్స్ క్లబ్ సేవా భావం, సేవా దృక్పథం జిల్లాకే ఆదర్శం అని డిస్ట్రిక్ట్ గవర్నర్ కొనియాడారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, తిలక్ చక్రవర్తి, శరత్ బాబు, పోకల ఆంజనేయులు, డాక్టర్ వెంకటేశ్వర్లు, మనోజ్ కుమార్ అగర్వాల్, బేని గోపాల్ త్రివేది, లయన్ మహిళలు బంక కళావతి, కజంపురం జయప్రద, మనిషా అగర్వాల్, ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Governor N Venkateshwar Rao is no match for Ramagundam Lions Club