
కాటారం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దుద్దిళ్ళ శ్రీపాద రావు 26వ వర్ధంతి కాటారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు 26వ వర్ధంతి సందర్భంగా కాటారం మండలం లో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేసినందుకు పుష్పగిరి ఆసుపత్రి యాజమాన్యనికి కృతజ్ఞతలు తెలిపారు. కంటి చూపు లోపం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి కంటి పరీక్ష చేసుకోవాలని. చికిత్స అవసరం ఉన్న ప్రతి ఒకరికి ఉచితంగా వైద్య సేవలు అందించి కంటి అద్దాలు కూడా ఇస్తారని తెలిపారు.
మా కుటుంబంపై మీకున్న ప్రేమనురగలకు మేము ఎల్లప్పుడూ సేవకులుగా ఉంటామని భవిష్యత్తులో మరిన్ని పేద ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యక్రమాలను మీ ముందుకు తీసుకువస్తామని అలాగే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
