వికారాబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్
త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుభాకాంక్షలు తెలిపారు. 2025 వ సంవత్సరం జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని మరింత పట్టుదల, కృషితో తో విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి గెలుపును అందించే సంవత్సరం కావాలని కలెక్టర్ అభిలషించారు.
తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు, పుష్ప గుచ్చాలు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అధికారులకు బొకేలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమని, అయితే వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్లాంకెట్స్,విద్యార్థులకు ఉపయోగ పడే ఇతర సామగ్రి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వివిధ శాఖల అధికార
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App