TRINETHRAM NEWS

District Collector Muzammil Khan presented the uniform to the government school students

*చిన్నతనం నుండి మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి

రామగిరి, మే -30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ అనంతరం స్వశక్తి మహిళా సంఘాలు ఉపాధి కల్పనకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.

గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, పిల్లలు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు అని  ప్రశ్నించారు. మన జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే ముందస్తుగా మనం మంచి ఆరోగ్యంతో ఉండాలని, దీనికోసం చిన్నతనం నుంచే మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, రోజు కొంత సమయం శారీరక దృడత్వం కోసం వ్యాయామం, క్రీడలు ఆడటం వంటివి చేయాలని అన్నారు
అనంతరం స్వశక్తి మహిళా సంఘాలు స్కూల్ యూనిఫాం కుట్టే సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్, మహిళలతో కలిసి ఏకరూప దుస్తులు కుట్టారు. ప్రస్తుతం సుందిళ్ళ గ్రామంలో స్వశక్తి సంఘాలకు 1728 మంది విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తుల కుట్టే ఆర్డర్ అందించామని, మొదటి జత దుస్తులు కుట్టడం పూర్తయిందని, ప్రస్తుతం రెండవ జత దుస్తుల కుట్టుడు పని జరుగుతుందని అధికారులు వివరించారు
ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి ఆర్డర్ స్వశక్తి మహిళా సంఘాలకే అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్డర్ల పైనే ఆధారపడకుండా ప్రైవేట్ రంగంలో గల అవకాశాలను సైతం మహిళా సంఘాలు అన్వేషించాలని కలెక్టర్ సూచించారు
స్వశక్తి మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక ప్రణాళికలు  రూపొందిస్తున్నామని, ఆసక్తి గల వారికి బ్యూటిషన్ కోర్సులు నేర్పిస్తామని, అదే విధంగా కొన్ని మహిళా సంఘాలు కలిసి విజయ డైరీ తో ఒప్పందం చేసుకొని చిల్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటున్నాయని, ఈ రకంగా వివిధ ఉపాధి అవకాశాలు మహిళా సంఘాలకు కల్పించేందుకు పూర్తి సహకారం అందజేస్తామని, అనంతరం మహిళా సంఘాల మహిళలను కలెక్టర్ సన్మానించారు
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, డి.ఆర్.డి.ఓ. ఆర్ రవీందర్ పాఠశాల అకాడమిక్ మోనిటరింగ్ అధికారి డాక్టర్ పి ఎం షేక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Muzammil Khan presented the uniform to the government school students