TRINETHRAM NEWS

పెద్దపల్లి, ఫిబ్రవరి-24: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భూముల సర్వే సరిహద్దు రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లాలోని సర్వేయర్ల కు నూతనంగా 8 ల్యాప్ టాప్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సర్వేయర్లు పని తీరు మెరుగు పర్చుకోవాలని, వారి నాణ్యమైన పనితీరుకు దోహదపడే విధంగా నూతనంగా అందించిన 8 ల్యాప్ టాప్ లను వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, సర్వేయర్లు అనిల్, సునీల్, నరేష్, శ్రీనివాస్ కృష్ణప్రియ ,రాధిక, రాజశేఖర్, చారి ,రఘుపతి , సాయి చరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector Koya Shri Harsha