District Collector Koya Harsha said that public hearing applications should be resolved promptly
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, జూలై -1: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించా లని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ , జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ధరణి భూ సమస్యలకు సంబంధించి ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరిస్తూ సదరు దరఖాస్తు ప్రస్తుత స్థితిగతులను ఆన్ లైన్ లో పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు.
పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామానికి చెందిన రంగు సతీష్ కుమార్ తమ వ్యవసాయ భూమికి ఎస్సారెస్పీ డి83 కెనాల్ ద్వారా పిడుగు బండల దగ్గర వచ్చే చిన్న నీటి కాలువను పూడ్చి వేసారని, దీని వల్ల తన పొలంతో పాటు మరో 5 నుంచి 10 ఎకరాల భూమికి సాగునీరు అందడం లేదని, ఈ కాలువను మళ్ళీ తీయించి తమ పొలాలకు నీళ్లు అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ వెంటనే అవసరమైన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
మంథని మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన ఎండి రియాజ్ అక్కెపల్లి ఆర్జి 3 భూ సేకరణ క్రింద గ్రామ శివారులోని 564 ప్రాజెక్ట్ నెంబర్ కు తనకు మొదటి పేమెంట్ వచ్చిందని గెజిట్ ఆర్ అండ్ ఆర్ లో పేరు తప్పుగా నమోదు అయిందని దానికి సరిచేసి రెండో పేమెంట్ వచ్చే విధంగా చూడాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మంథని రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన హనుమల కమలమ్మ తన భర్త మధునయ్య మరణించారని, తన భర్తకు అప్పన్నపేట గ్రామంలోని సర్వే నెంబర్ 705 లో 14 గుంటల భూమి ఉన్నదని, తన ఇద్దరు కుమారులు 14 గుంటల భూమికి పట్టా చేసుకున్నారని, అప్పటినుండి నాకు తిండి, నివాసం కల్పించడం లేదని, తన భర్త యొక్క భూమిని తన పేరుపై మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన సుద్దాల సతీష్ గౌడ్ సబ్బితం గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారికి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App