TRINETHRAM NEWS

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, అక్టోబర్-07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు శ్యామ్ ప్రసాద్ లాల్,అరుణశ్రీ తో కలిసి కలిసి పాల్గొన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్  కేటాయించి ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి  (14 ) దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామం సబ్-స్టేషన్ ఏరియా కు చెందిన కే.పరమేష్ పెద్దపల్లి ప్రగతి నగర్ ఏరియా బజాజ్ షోరూం ముందర ఒక పిచ్చి యువతీ ఉంటుందని, ఆమె ను పిచ్చి ఆసుపత్రి తరలించి చికిత్స అందించాలని, మిగిలిన అడుక్కునే వారిని కట్టడి చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఎల్లంపల్లి స్టేజ్ 2 ఫేస్ 1 లో భాగమైన నంది మేడారం పంప్ హౌస్ లో 9 సంవత్సరాల టెక్నికల్ సిబ్బంది గా పనిచేస్తున్న 9 సిబ్బంది తమకు కనీస నిలబెతనంతో కూడిన భద్రత కల్పించి రెగ్యులర్ డ్యూటీలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా ఇరిగేషన్ అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జగిత్యాల జిల్లా నివాసి అయిన ఎం.సత్యవతి ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులోని సర్వే నెంబర్ 194ఆ/12/1 లో ఉన్న 8 గుంటల తన తల్లి మరణించిన తర్వాత విరాసత్తు పెట్టుకోగా 6 గుంటలు మాత్రమే తన పేరు మీద నమోదు అయిందని, మిగిలిన 2 గుంటలు కూడా తన పేరుపై నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ధర్మారం తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పెద్దపల్లి జిల్లా నివాసి ఏ.ప్రసాద్ తన పేరు మీద, భార్య పేరు మీద మొత్తం 1,86,541 రూపాయల క్రాప్ లోన్ ఉందని, ఆధార్ పేరు, బ్యాంకు ఖాతా పేరు వేరుగా ఉన్నాయనే కారణంతో పంట రుణమాఫీ ఆపారని, కానీ పేర్లలో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవని , అన్ని డాక్యుమెంట్లలో ఒకే విధంగా పేరు ఇంటి పేరు సరిగ్గా ఉన్నాయని, దయచేసి తమ సమస్యను పరిష్కరించి రుణమాఫీ చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిక రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ  సమావేశంలో  వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App