TRINETHRAM NEWS

District Collector Koya Harsha Peddapalli MLA Vijaya Ramana Rao took strong measures to provide essential nutrients to all children

పెద్దపల్లి, సెప్టెంబర్ 28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పిల్లలందరికీ అవసరమైన పోషకాలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష  తెలిపారు.

శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి లోని నందన గార్డెన్స్ లో నిర్వహించిన పోషణ్ మహా 2024 జిల్లా స్థాయి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావుతో కలిసి పాల్గొన్నారు.

పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా నందన్ గార్డెన్స్ లో నిర్వహించిన గర్భిణులకు శ్రీమంతం, పసిపిల్లలకు అక్షరాభాస్యం కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ,   అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, ప్రతి పిల్లవాడి ఎత్తు, బరువు పరిశీలించి సరైన వివరాలు నమోదు చేయాలని, పోషక లోపాలు ఉన్న పిల్లలకు బాలామృతం తప్పనిసరిగా అందజేయాలని కలెక్టర్ అంగన్ వాడి టీచర్లకు సూచించారు.

ప్రతి బుధవారం పోషక లోపం ఉన్న పిల్లల తల్లి తండ్రులతో పిల్లల అందించాల్సిన పోషకాహారం, పాటించాల్సిన శుభ్రత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో  అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లల జాబితా ఉంటే సేకరించి సమర్పించాలని అన్నారు. అంగన్ వాడి టీచర్లు చేసే కృషి ప్రతి ఒక్కటి గమనిస్తున్నామని , బాగా పని చేసే వారికీ తప్పనిసరిగా మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.


అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గుడ్ల నాణ్యతను పరిశీలించాలని, నాణ్యత లేని, సైజ్ తక్కువ ఉన్న గుడ్లను తిరస్కరించాలని కలెక్టర్ తెలిపారు. పాలు, పప్పు సరఫరా మొదలగు అంశాలలో ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని రావాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు అనేమియా ఉంటే అవసరమైన పోషకాహారం, మందులు అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అంగన్ వాడి కేంద్రాలను పూర్వ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని,  కర దీపిక, ప్రియదర్శిని ప్రకారం పిల్లలకు ఆట పాటలతో బోధన అందించాలని అన్నారు.
ప్రతి రోజు అంగన్ వాడి కేంద్రాలలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బోధన జరగాలని అన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు
మాట్లాడుతూ,  పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో  అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం నిర్మించేలా అనువైన స్థలం గుర్తించి కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు పౌష్టికాహారం సజావుగా అందజేయాలని అన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, గురువులకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, పసి పిల్లలకు అంగన్వాడీ టీచర్లకు తొలి గురువులు అవుతారని, ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని  విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు కే.రేవతి, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప,  జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సిడిపిఓ లు, అంగన్ వాడి టీచర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App