TRINETHRAM NEWS

పెద్దపల్లి, ఏప్రిల్ -02// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి జ్యోతి పాల్గొని ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు పాటుపడాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో సహయ బీసి అభివృద్ధి అధికారి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఎం.అంజయ్య గౌడ, గౌడ సంఘ ప్రతినిధులు బాలసాని వెంకటేశం గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District BC Development Officer