విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ
ప్రకాశం జిల్లా మార్కాపురం త్రినేత్రం న్యూస్
తేది:21.1.2024.
మార్కాపురం పట్టణం.
** ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినిలకు 2,280 నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినీలను ఉద్దేశించి శాసనసభ్యులు వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ బాబు జన్మదినం అయిన జనవరి 23వ తేదీన ఈ నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయాల్సి ఉందని కానీ అదే రోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లోని ఇంటి వద్ద ఏర్పాటు చేశామని అందువలన ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసి వచ్చిందని అన్నారు.
ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని కానీ అందరి కృషితో విద్యా సదుపాయాలు మెరుగు చేస్తామని ప్రతి విద్యార్థి, విద్యార్థినిలు చిన్న వయసు నుంచి ఉన్నత లక్ష్యం ఎంచుకోవాలని నిత్యం కష్టపడే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి, నిరుద్యోగి, వ్యాపారవేత్త, రైతు, రైతు కూలీ కూతురైన కొడుకు అయినా కష్టపడితేనే ఫలితాలు వస్తాయని తద్వారా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
అలా కష్టపడి చదివి ఐఏఎస్,ఐపీస్, గ్రూప్ వన్ ఆఫీసర్లు ఈ ప్రాంతం నుంచి తయారు కావాలని దానికి తగ్గట్టుగా తమ వంతు సహాయం అందిస్తామని అన్నారు.
ప్రతి సంవత్సరం లోకేష్ బాబు పుట్టినరోజుకి ఈ స్కూల్లో ఏదో కార్యక్రమం చేపడతామని ఎల్లుండి జనవరి 23న జరిగే లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్కూల్ మెనూలో అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినీలు, ఉపాధ్యాయులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App