TRINETHRAM NEWS

బడ్జెట్ కేటాయింపులో తెలంగాణపై వివక్ష నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపు లో అన్యాయం చేసినందుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తాను మాట్లాడుతు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై ఉన్న వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించక నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు లబ్ధి చేకూర పోగా రాష్ట్రం అడిగిన నిధులకే ఎలాంటి కేటాయింపులు జరగలేదని మండిపడ్డారు రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బిజెపి ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ కేంద్రం నుంచి తెచ్చింది ఏమీ లేదని ఆరోపించారు. ఈ కార్యాక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి , జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ళ లక్ష్మీ, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ యువజన నాయకులు బొంగునూరి కిశోర్ రెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, జీహెచ్ఎంసీ 8 డివిజన్ల అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా షేక్ రఫియా బేగం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు కడియాల ఇందిరా, మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు, సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kolan Hanmant Reddy