TRINETHRAM NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో ఇక డిజిటల్ లెర్నింగ్ ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న రెండు మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా విద్యాశాఖ పనిచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద 8700 పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించినట్లు తెలిపింది.

సమకాలీన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు డిజిటల్ విధానంలో బోధన అందిస్తున్నామని, బైజూస్ కంటెంట్ తో విద్యార్థులకు ట్యాబ్లు కూడా అందుకే ఇచ్చామని చెప్పింది. ఈ డిజిటల్ లెర్నింగ్ కోసం ప్రభుత్వం 2400 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది.