TRINETHRAM NEWS

Dhoni’s 100 feet cut-out discovery! Not somewhere.. near us!

Trinethram News : Andhra Pradesh : 6th July 2024 టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొద్ది అభిమానులున్నారు. అందులో తెలుగు వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అయితే.. తాజాగా తెలుగు వాళ్లు ధోనిపై తమ వంద అడుగుల అభిమానం కురిపించారు.

ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వంద అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటు చేసి.. ధోనిపై తమ అభిమానం చాటుకున్నారు.

ఏపీలోని నందిగామలో తెలుగు ధోని ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోని బర్త్ డేకు ఒక రోజు ముందు అంటే జులై 6(శనివారం) నాడు ఈ కటౌట్‌ను ఫ్యాన్స్ తో స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ఆశిష్కరించారు.

ధోని బర్త్‌డేను రోజున దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు స్వీట్లు పంచడం, అన్నదానం చేయడం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే.. నందిగామ తెలుగు అభిమానులు ఒక అడుగు ముందుకేసి.. వంద అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dhoni's 100 feet cut-out discovery! Not somewhere.. near us!