అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తజనం రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్టు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ్‌లల్లా ఆలయంలో బాలరాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. దీంతో బాల రాముడికి విశ్రాంతి ఇచ్చేలా శుక్రవారం నుంచి రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంచుతారు.
‘‘రామ్‌లల్లా ఐదేళ్ల బాలుడు. ఇన్ని గంటల పాటు మెలకువగా ఉండటం వల్ల పడే ఒత్తిడిని తట్టుకోలేరు. అందువల్ల బాల రాముడికి కొంత విశ్రాంతి ఇచ్చేందుకు రోజూ గంట సేపు ఆలయ తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. దీంతో మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు ఆ దేవతామూర్తికి విశ్రాంతి దొరుకుతుంది’’ అని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత భక్తులు పెద్దసంఖ్యలో అయోధ్యకు తరలివస్తుండటంతో గతంలో ఉన్న దర్శనవేళల్ని మార్పు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వామి వారికి సుప్రభాత సేవా కార్యక్రమాలు తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమవుతున్నాయి. ఆ తర్వాత ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రాములోరి దర్శనం కోసం భక్తజనాన్ని అనుమతిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు
Related Posts
శ్రీ క్రోధి నామ సంవత్సరం
TRINETHRAM NEWS Trinethram News : శ్రీ గురుభ్యోనమఃశనివారం,నవంబరు23,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షంతిథి:అష్టమి రా10.08 వరకువారం:శనివారం(స్థిరవాసరే)నక్షత్రం:మఖ రా10.21 వరకుయోగం:ఐంద్రం మ3.23 వరకుకరణం:బాలువ ఉ9.37 వరకుతదుపరి కౌలువ రా10.08 వరకువర్జ్యం:ఉ9.35 – 11.17దుర్ముహూర్తము:ఉ6.12 –…
Tirumala : ఈనెల 25న తిరుమల రూ.300 దర్శన టికెట్లు
TRINETHRAM NEWS ఈనెల 25న తిరుమల రూ.300 దర్శన టికెట్లు Trinethram News : ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈనెల 25న విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ttdevasthanams.ap.gov.in…