TRINETHRAM NEWS

వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకునేందుకు తనకు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు..

వినుకొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించేందుకు తాను అంకితభావంతో పని చేస్తానని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఐదు ఆరు వార్డులలో ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తపేట వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ,
మీరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించామని 270 ఎకరాలుగా చెరువును విస్తరించి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. కొండమీద ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టామని ఆలయాన్ని పునర్నిర్మానం చేస్తున్నామని చెప్పారు. డిగ్రీ కాలేజీ వద్ద స్టేడియం నిర్మాణం ఎన్ఎస్పీ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్, 100 పడకల ఆసుపత్రి, సురేష్ మహల్ రోడ్డు విస్తరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే చూసి ఓర్వలేక కోర్టులో కేసు వేసి అడ్డుకున్న నాయకుడు కావాలా.. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వాళ్ళ కావాలో ప్రజలు ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పారు…

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని అందుకే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ని ఓడించడం కోసమే పొత్తులు పెట్టుకున్న పార్టీల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని.. అభివృద్ధి సంక్షేమతాలకు ప్రాంతాలకు అతీతంగా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి దీవించి ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్ర భవిష్యత్తులో మేలు జరుగుతుందని అన్నారు.

అబద్దాలతో ఉచిత హామీలతో ప్రజల ముందుకు వస్తూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్న తెలుగుదేశం జనసేన బిజెపి నాయకుల నైజాన్ని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.

2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడుకి 2019 నుండి 2024 వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనను బేరీజు వేసుకొని ఓటు వేయాలని కోరారు. ప్రజల కష్టాలు ప్రజల అవసరాలు ప్రజల ఆలోచనలను తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ని అని ప్రజల్ని మోసం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలోని 87% కుటుంబాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, మహిళలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 14 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఆదుకుని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిపిస్తే… ఇంటికో లక్ష రూపాయలు ఇస్తానని చెప్తున్నాడని ఇలాంటి మోసపూరిత హామీలు నమ్మి మోసపోవద్దని కోరారు. పదేళ్లు ఎమ్మెల్యే గా పని చేసిన జీవి ఆంజనేయులు వినుకొండకు ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని.. ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే దొరలంతా ఏకమయ్యారని, నా ఐదేళ్ల పదవీకాలంలో ప్రజల కోసం కష్టపడి పని చేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని నమ్మితే మరో మారు తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాకు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు చిలుక ఓటు వేసి గెలిపించి సంక్షేమ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలని కోరారు.

ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్న నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని బొల్లా పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు….