
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం అరకువేలి ఏప్రిల్ 8: అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు నియోజక వర్గం,డుంబ్రిగూడ మండలానికి విచ్చేసిన తరుణంలో అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం,మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో గల రోడ్లు,బ్రిడ్జిలు సమస్యల గురించి వివరించి నిధులను మంజూరు చేయవలసిందిగా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం తో మాట్లాడుతూ,అరకునియోజ వర్గం నుండి పాడేరు నియోజకవర్గం కలుపు మార్గమైన బోసరి గడ్డపై గల వంతెన నిర్మాణం
అత్యవసరమని,వంతెన లేక ఎన్నో ఏళ్ళు నుంచి పలువురు గిరిజనులు నీటి మునిగి కొట్టుకుపోయి తమ ప్రాణాలు కోల్పోవడం జరిగిందని తెలిపారు.ముంచంగిపుట్టు మండలం,జర్జుల పంచాయతీ, జర్జుల పి ఆర్ రోడ్డు నుండి అంబపాడ వరకు నూతన రోడ్డుతో పాటు బీటీ రోడ్డు, హుకుంపేట,మండలం,హుకుంపేట గ్రామం నుండి చీడిపుట్టు వెళ్ళు మార్గంలో గల వంతెన నిర్మాణం,ముంచంగిపుట్టు మండలం,కర్రీ ముక్కుపుట్టు పంచాయితీ,కర్రి ముక్కు పోటు పి ఆర్ రోడ్డు నుండి రోడ్ల పుట్టు గ్రామం వరకు నూతన బ్రిడ్జ్ నిర్మాణం కొరకుముంచంగిపుట్టు మండలం,జర్జుల పంచాయతీ టంకపుట్టు నుండి కడెం బీరు మార్గంలో గల నూతన బ్రిడ్జి నిర్మాణం కొరకు,
ముంచంగిపుట్టు మండలం,బుంగ పుట్టి పంచాయతీ బుంగపుట్టు పి ఆర్ రోడ్డు నుండి రంగని గూడ మీదుగా ఏడుకొండల బంధ వరకు నూతన బీటీ రోడ్ నిర్మాణం కొరకు,నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
