
అల్లూరిజిల్లా త్రినేత్రం. న్యూస్ అరకు నియోజవర్గం డుంబ్రిగూడ ఏప్రిల్ 8: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయితీ పరిధిలోని పెదపాడు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ రహదారి అభివృద్ధికి శంకుస్థాపన చేసి, అక్కడి గిరిజనులకు అభివృద్ధి సంకల్పం తెలిపారు. శంకుస్థాపన అనంతరం గ్రామంలో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా తయారుచేసిన కిట్లు అందజేశారు. అలాగే, చిన్నారులకు స్వీట్ బాక్సులు పంపిణీ చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ప్రజల మధ్య ఉండాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ వాహనంపై చాపరాయి వాగును దాటి కొంతదూరం ప్రయాణించి, అక్కడి నుంచి కాలినడకన పెదపాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సంప్రదాయ దింసా నృత్యం, డప్పు వాయిద్యాలతో పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్యం, రహదారి, మౌలిక సదుపాయాల గురించి వారికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనతో గిరిజనుల మధ్య ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా చేసింది. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి మరో అడుగు ముందుకేసినట్లు అయింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
