TRINETHRAM NEWS

భక్తుల కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పళని కి నూతన బస్సు సర్వీస్ లను ప్రారంభించారు..

Trinethram News : తిరుపతి పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం మంగళగిరిలో ప్రారంభించారు. వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ క్రమంలో.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంఎల్సీ హరి ప్రసాద్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ మరియు తిరుపతి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy Chief Minister launches