TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC 10th Class) పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుపుతూ షెడ్యూల్ రిలీజ్ చేసింది తెలంగాణ బోర్డు ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌.

షెడ్యూల్ ప్రకారం డేట్ వైజ్ గా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.

పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం..

మార్చి 18: ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)

మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్( హిందీ)

మార్చి 21: థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

మార్చి 23: మ్యాథమెటిక్స్

మార్చి 26: సైన్స్ పేపర్ -1 (ఫిజిక్స్)

మార్చి 28: సైన్స్ పేపర్ -2 (బయాలజీ)

మార్చి 30: సోషల్ స్టడీస్

అదేవిధంగా ఏప్రిల్ 1వ తేదీన ఒకేషనల్‌ కోర్సు వారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్‌, 2వ తేదీన రెండవ పేపర్‌ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ సారి పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మాల్ ప్రాక్టీస్ ను అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టామని చెబుతోంది. అదేవిధంగా ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

మరోవైపు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. 2024 ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయని బోర్డు వర్గాలు తెలిపాయి.