
త్రినేత్రంన్యూస్: మార్చ్ 19: నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన, వ్యవసాయ శాఖ,సాధికార సంస్థ, నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం , ఈ కార్యక్రమంలో భాగంగా, మెంటర్స్ ,కళావతి మాట్లాడుతూ, ఏ .గ్రేట్ .మోడల్స్, ఏ .గ్రేడ్ .మోడల్స్, పంటలను పండిస్తున్నారు, అందులో ఎటువంటి కెమికల్స్ వాడకుండా, జనజీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, అజ్ఞాసరం, ఇలా మొదలైనవి వాడుతూ పంటను పండిస్తున్నట్టు కళావతి పేర్కొన్నారు, ఇందులో భాగంగా నెలకు నాలుగు సార్లు అంటే వారానికి ఒకసారి , ఎమ్మార్వో కార్యాలయం ఆవరణంలో ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ప్రజలకు అవగాహనతో పాటు పండించిన కూరగాయలను తక్కువ ధరకే అమ్మడం, జరుగుతుంది అంటూ కళావతి ఈ సందర్భంగా తెలియజేశారు,
ఈ కూరగాయల్లో అన్ని జాతులు ఉన్నట్టు తెలియపరిచారు అవేమనగా గడ్డ జాతి, తీగ జాతి, టమోటా, పచ్చిమిరపకాయలు, ఇంకా మన ప్రాంతంలో, పండే విధంగా 25 రకాలు సంబంధించిన కూరగాయలను పండిస్తున్నట్టు వివరించారు అన్ని రకముల జాతులను సంబంధించిన కూరగాయలను ప్రదర్శించడం అమ్మడం జరుగుతుంది ఒక దిశలో సీజన్లో లేనప్పుడు, కొంత తగ్గిన మిగతా సమయంలో ప్రతి కూరగాయల జాతి ఈ ప్రదర్శనలో చూపించడం ప్రజలకు అవగాహన కలిగించడం వాటిని ఇక్కడే అమ్మడం జరుగుతుంది అంటూ తెలియపరిచారు, వారంలో ఒక మూడు రోజులు ఈ ప్రదర్శన అనేది కావలిలో వివిధ ప్రాంతంలో జరుగుతుంది, అంటూ కళావతి వివరించారు,
ఈ ప్రదర్శనకు ప్రజలు వచ్చి మేము చెబుతున్న విషయాలను ఆసక్తితో వింటూ ప్రతి కూరగాయనుకుంటున్నారు ఇంచుమించు మాకు రూపాయలు4,000 వేల నుండి 5000 వేల , దాకా కూరగాయలు అమ్ముడుపోతున్నాయి అంటూ తెలియపరిచారు, కూరగాయలు మిగిలిపోయి వ్యర్థం కాకుండా ఇక్కడ అమ్మకాన్ని బట్టి తగు మటుకు కూరగాయని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది, ఆనిమడుగు, సర్వే పాలెం, మా ఐఎఫ్ఎస్సి లో పండుతున్న కూరగాయలను సకాలంగా మేము తీసుకురావడం జరుగుతుంది,
ఈ కార్యక్రమానికి ప్రధాన అంశం ఏంటి అంటే ప్రజలు ఈ కూరగాయలను తినడం కొనడం అలవాటు చేసుకుంటే , పూర్తి స్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అరికట్టవచ్చు అంటూ కళావతి ,మాటల్లో వివరించారు, ఈ ప్రదర్శనకు ముఖ్యాంశం ఏందంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి, అలాగే రైతు కూడా అవగాహన కలిగి నష్టపోకుండా, ఉండాలని ఈ సందర్భంగా కళావతి తెలియపరిచారు, ఇంకా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకున్న కొద్దిపాటి స్థలములోనే ఇంటి దగ్గరే వీటిని పండించుకోవచ్చు ఆ పండించుకునే విధానం కూడా వివరించారు, ఇది మన ఇంటికే కాకుండా మనము దీని ద్వారా వ్యాపారం కూడా చేయవచ్చని అవగాహన ప్రదర్శన ద్వారా ప్రజలకు మేము అందించే సందేశం ఇదే, ఇంటిదగ్గర శ్రీలు ఈ కూరగాయలు వ్యాపారం మొదలుపెడితే ఇంచుమించు, రూపాయలు 500 వందల నుండి నుండి 1000 వేయి రూపాయలు దాకా, ఆదాయం మనం చూడొచ్చని కళావతి తెలియపరిచారు, ప్రభుత్వం, సహకారంతో, మా ఉద్దేశం ప్రజలు లోకి వెళ్లే విధంగా మాకు సహాయం అందించాలని, కోరడం జరిగింది, రైతులకు కూడా
ఈ సదస్సు ద్వారా అవగాహన రావాలని ఏకపంట విధానాన్ని మానుకోవాలి, ఎందుకంటే ఒకవేళ ఆ పంట ఏ కారణం వలన, నష్టపోతే రైతు ఎంతో ఇబ్బందులకు గురి ఆవే పరిస్థితులు తలెత్తుతాయి, అయితే పలు రకాల పంటను మనం వేసినప్పుడు రైతు కూడా మంచి ఆదాయం చూడవచ్చని ఆమె ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు, ఈ పంటలు ద్వారా వ్యవసాయ భూములు కూడా సార్వంతంగా మారుతుంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎఫ్, ఎస్ ,సి ,లు, శ్రీహరి, రాజేష్, భాస్కర్, హైమా, ప్రగతి, ప్రేమ్ కుమార్, రోజా, గౌస్య, తదితరులు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
