
-పోలింగ్ కేంద్రాల వద్ద 163 బన్స్ ఆక్ట్ (144 సెక్షన్) అమలు.
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో శాంతి భద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ తెలిపారు. మంచిర్యాల జోన్ లోని మ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను డీసీపీ పోలీస్ అధికారులతో పరిశీలించి భద్రత పరంగా చేయవలిసిన ఏర్పాట్ల గురించి అదికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ”ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం మంచిర్యాల జోన్ వ్యాప్తంగా మంచిర్యాల జోన్ వ్యాప్తంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు 58, లొకేషన్లు 21, మొత్తం పోలింగ్ స్టేషన్లు 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోలీస్ కేంద్రాల వద్ద బన్స్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినట్లు గమనించిన వెంటనే డైల్ 100 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
