Trinethram News : Mar 14, 2024,
సోనియాని కలిసిన డానిష్ అలీ
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. దీంతో ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారన్న వార్తలకు బలం చేకూరుతోంది. ‘నేను సోనియా గాంధీ ఆశీస్సులు తీసుకున్నా. రానున్న ఎన్నికల్లో అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తాను. ఆమె హృదయం పేద ప్రజలకు కోసం తపిస్తూ ఉంటుంది’ అని అలీ పేర్కొన్నారు.