TRINETHRAM NEWS

అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బుధవారం అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ రామగుండం నగర కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు
నగరంలోని 11వ డివిజన్, 33వ డివిజన్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను అదనపు కలెక్టర్ పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న మ్యాన్ హోల్స్ ను వెంటనే సరి చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో నిర్మించిన రోడ్డుపై గల మ్యాన్ హోల్స్ లోపలికి కుగిపోయి పిచ్చి మొక్కలు పెరగకుండా మ్యాన్ హోల్స్ పై కప్పులను సరిచేయాలని అన్నారు
గోదావరిఖని లోని ప్రశాంత్ నగర్ లోని మల్కాపూర్ చెరువును అదనపు కలెక్టర్ పరిశీలించారు. చెరువుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మల్కాపూర్ చెరువు అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు
అనంతరం అదనపు కలెక్టర్ రామగుండం పోలీస్ కమిషనర్ ను కలిసి ఆస్తి పన్ను వసూలు పై చర్చించారు
ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dangerous man holes should