
Trinethram News : దండకారణ్యంలో మరో సారి తుపాకి కాల్పులతో దద్దరిల్లింది, ఒకే రోజు బీజాపూర్ జిల్లా కాంకేర్ జిల్లాలో వేరు వేరు జరిగిన ఎన్కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు అధికారులు తొలగించారు.
సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్‌కు చెందిన ఒక జవాను మృతి చెందినట్లు అధికారు లు తెలిపారు.
బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం నుండి భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి.
ఈ క్రమంలో భద్రతా దళాలకు ఎదురపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు.
ఎన్ కౌంటర్ ఘటనా స్థలంలో 18 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎదురుకాల్పులు కొనసాగు తున్నాయని, భద్రతా సిబ్బంది తిరిగి వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా చత్తీస్ గఢ్ అడవుల్లో సాగుతున్న ఆపరేషన్ కగార్ తో పచ్చని గిరిజన పల్లెలు రక్తమోడు తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
