TRINETHRAM NEWS

దామగుండం అడవి సంఘటన పై విచారణ జరిపించాలి.

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కార్యదర్శి వై గీత మాట్లాడుతూ,దామ గుండం అడివిలో 2900 ఎకరాలు నేవీ రాడార్ కేంద్రానికి అప్పగించిన నేపథ్యంలో VLF కేంద్రం శంకుస్థాపన జరిగి దాదాపు రెండు నెలలు కావస్తుంది. ఇప్పుడు దామగుండం అడవి లో చెల్లరేగుతున్న మంటలతో అడవి దగ్నమై నా సంఘటనతో చాలా విలువైన ఔషధ మొక్కలకు జరిగిన నష్టానికి గల కారణాలేమిటి అనే విషయం లో సంఘటన పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్రమైన విచారణ జరిపించి అడవిలో ఏం జరిగింది. మంటలు ఎందుకు చెలరేగాయి ఎంత అడవి నష్టం జరిగింది. అసలు ఎముకలు కొరికే చలికాలంలో పచ్చని అడివి ఎట్లా దగ్నం అయింది దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించి ఈ అడవి దగ్నం కావడానికి గల కారణాలను బహిర్గతం చేయాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App