TRINETHRAM NEWS

అల్లూరు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 23 : అరకువేలి మండలం బొండం పంచాయతీ గన్నెల జంక్షన్ నుండి కరకవలస రైల్వే స్టేషన్ వరకు రెండో లైన్ రైల్వే పనులు కోసం, ఆర్ఎస్ ఆర్, తుంబాత్, టి ఎన్ టి కంపెనీల పెద్ద పెద్ద వెహికల్స్, కంటైనర్స్ రోడ్డు మీద రావడం వలన సుమారుగా 650 మీటర్లు రోడ్డు మరమ్మతులకు గురైంది.
మరమ్మత్తులకు గురైన రోడ్డు పనులను తక్షణమే మరమ్మత్తులు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రైల్వే పనుల టెండర్ కంపెనీల వాహనాలు నిలుపుదల చేసి ఆందోళనచేయడమైనది ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ మండల కార్యదర్శి జి బుజ్జి బాబు మాట్లాడుతూ రైల్వే రెండో లైన్ పనుల నిమిత్తం గన్నెల జంక్షన్ నుండి కరకవలస రైల్వే స్టేషన్ వరకు రోడ్డు ధ్వంసమైందని సంబంధిత రైల్వే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వారికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైల్వే అధికారుల నుండి సంబందిత కన్స్ట్రక్షన్ కంపెనీల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు పనులు నిలిపి ఆందోళన చేయడం జరిగింది.
ఈ రోడ్డు చుట్టుపక్కల గ్రామస్తులకు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్ళాలన్న అనారోగ్యం పాలైన వారికీ హాస్పిటల్ కు చేర్పించాలన్న గర్భిణీ స్త్రీలు నెలవారిగా చెకప్ చేసుకోవడానికి ప్రసావానికి తీసుకొని వెళ్ళడానికి ప్రధాన రోడ్డు మార్గం రైల్వే రెండో లైన్ పనులు వలన గన్నెల జంక్షన్ నుండి కరకవలస మధ్యలో సుమారు 650 మీటర్స్ వరకు రోడ్డు మరమ్మత్తులకు గురవడం తో చుట్టూ ప్రక్కల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రమాదం అని తెలిసిన ప్రాణాల్ని గుప్పల్లో పెట్టి ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు కంపెనీ యజమానులు స్పందించి రోడ్డు మరమ్మత్తుల చేసి చుట్టూ పక్కల గ్రామస్తులకు రవాణా సదుపాయాం కల్పించాలని లేని పక్షంలో భవిష్యత్ లో గ్రామస్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కె రామారావు, కె బుజ్జి బాబు, టి జోషి, రేగా పెసా అధ్యక్ష కార్యదర్శి లు జి.డొంబు, కె అప్పన్న, కొత్త వలస పెసా ఉపాధ్యక్షులు జి సత్యరావు, కొత్త వలస వార్డ్ మెంబెర్ జి రామస్వామి, S.దొబులు, చుట్టూ పక్కల గ్రామస్తులు పి. ప్రసాద్, జి రాజు, పి. రాజు, టీడీపీ నాయకుల కె. దయనిది, జి. వెంకటరమణ, సిబో, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Damaged road works