CS reviewed through video conference with district collectors on land acquisition
జాతీయ రహాదారుల భూ సేకరణ త్వరితగతిన పూర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
*భూ సేకరణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఎస్
పెద్దపల్లి, ఆగస్టు-21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తో కలిసి జాతీయ రహదారుల భూ సేకరణ పై మంచిర్యాల, వరంగల్, హనుమకొండ ,పెద్దపల్లి ,రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ , ఖమ్మం జిల్లాల కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి సదరు భూమిని జాతీయ రహదారుల అథారిటీ అప్పగించాలని సీఎస్ ఆదేశించారు.
మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ 4 లైన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని, ఆర్భిట్రేషన్ క్రింద వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ లు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు చెల్లింపులు చేయాలని సీఎస్ సూచించారు.
భూ సేకరణ రైతులకు ఆర్భిట్రేషన్ ద్వారా మెరుగైన పరిహారం అందించి , భూములను త్వరగా జాతీయ రహదారి అథారిటీ బదలాయించాలని అన్నారు.
ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App