కార్తీక సోమవారం- భక్తుల సందడి
త్రిపురాంతకం, త్రినేత్రం న్యూస్ :- కార్తీక సోమవారం కావడంతో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవడం జరిగింది. విజయవాడ- కర్నూలు జాతీయ రహదారి మధ్యలో ఉన్న దేవాలయం కాబట్టి శ్రీశైలం వెళ్లే భక్తులు కూడా ఈ దేవాలయాలు దర్శించుకుంటారు. ఈ మాసంలో అయ్యప్ప స్వామి మాల ధారణ వేసిన భక్తుల కూడా ఎక్కువగా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. శ్రీ చక్రపీఠంపై వెలసిన దేవాలయాలు కావడం వలన ఈ మాసం లో భక్తుల రద్దీగా ఉంటారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App