మేడారం జాతరలో భక్తుల రద్దీ
ములుగు జిల్లా: జనవరి 21
వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. మహా జాతర జరుగ నుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు.
ఆదివారం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ర్టాల నుంచి భక్తులు మేడారానికి వచ్చారు.
జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి, కల్యాణకట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్నారు.
తల్లులకు పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, సారెను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి.