TRINETHRAM NEWS

జమ్మూ కాశ్మీర్‌ : ఏప్రిల్ 12 : జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి తీవ్రంగా గాయపడినట్టు సైన్యం తెలిపింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

పాకిస్థాన్ సైన్యం ఈ మధ్య పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోం ది. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి చొరబాటుకు ప్రయత్నించింది. దీన్ని భారత సైన్యం తీవ్రంగా తిప్పికొట్టింది. తాజాగా మరోసారి ఉల్లంఘించింది. దీంతో సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో మాత్రం ఒక సైనికుడు తీవ్రంగా గాయపడినట్లుగా పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Crossfire at the border