
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం మార్చి 18:
పి వి టి జి లకు జన్మం పథకంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లుకు 10 లక్షల రూపాయలు పెంచి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా ఆదివారం మండలంలో సిరిగం పంచాయతీ పివి టీజీ గ్రామాల్లో సంధి వలస పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం వచ్చే డబ్బులు సరిపోవని సిమెంటు ఐరన్ ఇతర గృహ సామగ్రి ధరలు పెరిగిపోయని పది లక్షలు ఇస్తేనే పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మించుకోవచ్చని తెలిపారు అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు మంచినీరు సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు ఈనెల 24వ తేదీన ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కారంకే జరిగే ధర్నాకి తరలిరావాలని పిలుపు ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు ఐస్ బాబు, పాంగి నాగేష్, మురళి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
