
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం అరకువేలి ఏప్రిల్ 3: ఈనెల 2 నుంచి 6 తేదీ వరకు మధురై లో జరుగుతున్న సందర్భంగా అరకువేలి లో పార్టీ కార్యాలయం లో పతాక ఆవిష్కరిస్తున్న సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తాంగుల హరి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ, సిపిఎం జాతీయ మహాసభ ఆరు రోజులు పాటు మదురైలో ఘనంగా జరుగుతున్నాయి ఈ మహాసభలో అతిరథ మహారధులు హాజరై దేశ భవిష్యత్తు కోసం దిశా నిర్దేశం చేయబోతున్నారు. దేశం ప్రపంచం మతోన్మాదం ఖబందహస్తలనుండి ప్రపంచ ఐక్యత (శాంతి) ని కాపాడాలని ప్రపంచ దేశాలను కమ్యూనిస్టు పార్టీ కోరుతుంది.
సంపద కొల్లగొడుతున్నా పెట్టుబడి దారులకు సహకరిస్తున్నా మతోన్మాద శక్తులను అడ్డుకోవాలని కోరుతున్నది. దేశం లో విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో లేదు నిరుద్యోగుల శాతం పెరుగుతుంది.
ప్రశ్నించే లౌకిక శక్తులు పై మతోన్మాద శక్తుల భౌతిక దాడులు పెరుగుతుంది మహిళలు పై అత్యాచారాలను పెంచి పోషిస్తున్నాయి ఆర్థిక అసమానతల కారణంగా దేశం ప్రపంచం సంక్షోభం లో కూరుకుపోతుంది. మత విద్వేషం పెరుగుతుంది. ఇటువంటి తరుణంలో సిపిఎం జాతీయ మహాసభ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నది అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు సిపిఎం మండల నాయకులు కిల్లో జగనాదం జి.చినబాబు పాంగి రామన్న జి.కోగేశ్వరావు కె.నానిబాబు పి.బాలక్రష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
