CP who presented raincoats to the armed personnel
రామగుండం పోలీస్ కమీషనరేట్
ఆర్ముడ్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందజేసిన సిపి
క్షేత్రస్థాయిలో పని చేసే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత : పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండము పోలీస్ కమీషనరేట్ లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
వర్షాకాల సమయంలో విధినిర్వహణలో భాగంగా వెసుకోవడానికి పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం
లో భాగంగా వచ్చిన రెయిన్ కొట్స్ ను ఆర్ముడ్ సిబ్బందికి ఈ రోజు సిపి పోలీస్ కార్యాలయంలో రామగుండము పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అందజేయడం జరిగింది.
ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నిరంతరం ఎండనకా, వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉంటు విధులు నిర్వహించాలని, ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, కన్న మధు , మల్లేషం, శ్రీనివాస్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App