TRINETHRAM NEWS

CP honored the retired officers and gave mementos

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి

అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటాం

పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులను

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు పోలీసు అధికారుల కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈరోజు పదవీ విరమణ పొందిన సిహెచ్ .రాజమౌళి,ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ మహిళా పోలీస్ స్టేషన్, శ్రీరాంపూర్. 1981 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా 1988 సంవత్సరం హెడ్ కానిస్టేబుల్ గా, 2001 సంవత్సరం అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా, 2009 సంవత్సరం సబ్ ఇన్స్పెక్టర్ గా, 2018 సంవత్సరం ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంఘవిద్రవశక్తులతో పోరాడి యాంటి ఎక్స్మిస్ట్ ఆపరేషన్ నందు విధులను నిర్వర్తించి, ప్రస్తుత పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగడానికి కీలకపాత్రను పోషించి విజయవంతంగా పదవి విరమణ పొందడం జరిగింది.

సిరాజ్ అహ్మద్ సబ్ ఇన్స్పెక్టర్ 1981 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 42 సంవత్సరముల 8 నెలలు విధులను నిర్వర్తించడం జరిగింది. టి. కళాదర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్,1984 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 40 సంవత్సరముల 9 నెలలు విధులను నిర్వర్తించడం జరిగింది.

కే లచ్చన్న ఏ ఆర్ ఎస్ ఐ, 1981 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 42 సంవత్సరముల 11 నెలలు విధులను నిర్వర్తించడం జరిగింది. డి.స్వామి,ఎఎస్ఐ -1907, 1989 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 34 సంవత్సరముల 10 నెలలు విధులను నిర్వర్తించడం జరిగింది. టి.కృష్ణమా చారి హెడ్ కానిస్టేబుల్ 1989 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 34 సంవత్సరముల 07 నెలలు ,03 రోజులు ,ఎస్ .రామచంద్రం, జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ శాఖలో పనిచేసి విఆర్ఓ నుండి జూనియర్ అసిస్టెంట్ రామగుండము కమీషనరేట్ లో విధులను నిర్వర్తించడం జరిగింది. 22 సంవత్సరముల 06 నెలలు విధులను నిర్వర్తించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు సంఘవిద్రోహశక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. పదవి విరమణ పొందిన అధికారులను ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకు సాగనంపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, ఎఆర్ ఎసిపి ప్రతాప్, ఏఓ అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, మల్లేషం, శ్రీనివాస్, సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిసి పవన్ రాజ్, గౌస్ రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CP honored the retired officers and gave mementos