TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని ఎల్లమ్మ చెరువు వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గోవింద్ హోటల్ చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు జరుగుతున్న వరద నీటి పైప్ లైన్ పనులు మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా పైప్ లైన్ పనులన్నీ పూర్తయ్యాయి అన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలోనే పూర్తిచేస్తామని అన్నారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ ను మల్లిస్తూ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను దశలవారీగా పూర్తిచేస్తూన్నామని తెలియచేసారు. ఎల్లమ్మ చెరువు వద్ద నిర్మిస్తున్న సీసీ రోడ్డును నాణ్యత ప్రమాణాలతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు తెలియచేసారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, కుమార్, రామకృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాంట్రాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Venkatesh Goud