
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 17 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్ లో పదిహేడు లక్షల రూపాయల నిధులతో మూడు గల్లీలలో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పాండుగౌడ్, పోశెట్టిగౌడ్, నాగభూషణం, మురళి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
