TRINETHRAM NEWS

నూతన శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 7: శుక్రవారం కెపిహెచ్బి డివిజన్ 7వ పేస్ పెద్దమ్మతల్లి వారి ఆలయం నందు నూతనంగా నిర్మించబోతున్న శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు ప్రజల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచి వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడడమే కాకుండా ప్రజలు మానసికంగా ప్రశాంతత పొందుతారని, భక్తి అనే భావం ప్రతి ఒక్కరిలో ఉండి వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి మరియు దేవాలయ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mandadi Srinivasa Rao