TRINETHRAM NEWS

కేరళలో విజృంభిస్తున్న కరోనా

కేరళలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మంత్రిత్వశాఖ డాటా ప్రకారం 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 300 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు మూడు మరణాలు కూడా సంభవించాయి. వీటితో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది. కాగా కరోనాను కట్టడి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు కేరళ వైద్య అధికారులు పేర్కొన్నారు.