
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 2 : అల్లూరిజిల్లా అరకువేలి మండలం సుంకరమెట్ట పంచాయతీ పివిటిజి గ్రామమైన మాలింబగుడ, గ్రామంలో దండ బాడు నుండి, లింబగుడ వరకు మంజూరైన రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
సుమారు 90 లక్షల రూపాయలతో మంజూరైన రోడ్డు పనులు రెండు రోజులు మట్టి పనులు చేసి నిలిపివేశారు.కాంట్రాక్ట్ వారితో గ్రామస్తులుగా మేము కలిసి మాట్లాడితే ఫారెస్ట్ అధికారులు ఈ రోడ్డుకి ఫారెస్ట్ అనుమతులు లేదు అని నిలిపివేశారని తెలిసింది.
అభివృద్ధికి దూరంగా ఉన్న మా పివిటిజీలకు జన్మన్ హౌసింగ్ మంజూరు అయి ఉంది ఇల్లు నిర్మించాలంటే రోడ్డు సౌకర్యం ఉండాలి రోడ్డు సౌకర్యం లేక ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాము ఇసుక, సిమెంటు, రాడులు, ఇతర ముడి సరుకులు, తీసుకురావాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాము కాబట్టి అధికారులు జోక్యం చేసుకొని, మా రోడ్డు త్వరితి గతిన పూర్తి చేసి మా రోడ్డు సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు వేడుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో పాంగి రాజు, మదు, రంజిత్, బాబురావు, సింగో, సుంక్ర, సరుబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
