TRINETHRAM NEWS

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

జగిత్యాల జిల్లా:

బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్.

ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్స వం సందర్బంగా ఈ కళాఖండం తయారీకి తాను సంకల్పించినట్లుగా ఆయన తెలిపారు.

60 గంటలకు పైగా శ్రమించి 16వేల పైగా బియ్యపు గింజలతో మందిర నిర్మాణం తయారు చేసానని త్వరలోనే ఈ మందిరాన్ని ప్రధాని మోడీకి అందజే స్తానని దయాకర్ తెలిపారు.

బియ్యపు గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తయారు చేయలేదని అటువంటి రామ మందిర నిర్మాణ కళాఖండం తయారు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని దయాకర్ అన్నారు.

బియ్యపు గింజలతో అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసిన డాక్టర్ దయాకర్‌ను పలువురు అభినందించారు. అయితే దయాకర్ గతంలో కూడా అనేక సూక్ష్మ రూప కళా ఖండాలను తయారు చేసి పలు అవార్డులతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు.