రెండవ ఏఎన్ఎంల మహాసభలను జయప్రదం చేయండి.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిమారేడు శివ శంకర్.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా కేంద్రంలో రెండవ ఏఎంఎంల కొల్లాపూర్ తాలూకా నాయకురాలు కే,మంజుల అధ్యక్షతన సమావేశం జరిగింది,
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ పాల్గొని ఈనెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎలైట్ హోటల్ నందు జరిగే తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం ల ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్ పిలుపునిచ్చారు. కొల్లాపూర్ పట్టణంలో మహాసభలకు సంబంధించి వాల్ పోస్టర్లు 2వ ఏఎన్ఎం ల తో కలిసి విడుదల చేసారు, అనంతరం మారేడు శివశంకర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ నందు గత 17 సంవత్సరాలుగా రెండో ఏఎన్ఎం గా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత 17 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏ ప్రభుత్వము తమను కనికరించలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికిని తమ జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదన్నారు. 33 రికార్డులతో పాటు అన్ని ఆన్లైన్ పనులు చేయాల్సి వస్తుందని చాలామంది రిటైర్మెంట్ అయ్యారని మరి కొంతమంది డిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో వచ్చినవారు చివరికి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి గానే పదవి విమరణనో లేక మరణం తోనే జీవితం ముగుస్తుందనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం గురించి పని చేసే వారికి ఎటువంటి హెల్త్ కార్డు లేదన్నారు. వాస్తవానికి రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చినప్పుడు రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చినప్పుడు వీరి జీతం చాలా తక్కువగా ఉంటుందని కాంట్రాక్టు పద్ధతిలో నెలకు 52000 రావాల్సిన వారికీ 27,000 వస్తుందన్నారు. ఆ వచ్చే 27000 లలో రికార్డులకు , ఉద్యోగంలోని ఇతర ఖర్చులకు 10వేలకు పైగా హెచ్చించాల్సి వస్తుందన్నారు. వీరి జీతాన్ని చూపించి వీరిలో కొంతమందికి రేషన్ కార్డు తొలగించారని తద్వారా ఆరోగ్యశ్రీ సేవలు కూడా మాకు ఉపయోగపడటం లేదన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వీళ్లకు ఏ ప్రభుత్వం కూడా కనీసం హెల్త్ కార్డు కూడా ఇవ్వలేని దారుణమైన స్థితిలో వారున్నారన్నారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో గత సంవత్సరంలో నిరవధికా సమ్మె నిర్వహించినప్పుడు సమస్యల పరిష్కరిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ ఆ హామీలను వరకు నెరవేర్చ లేదన్నారు. ఈనెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎలైట్ హోటల్ నందు జరిగే రాష్ట్ర ప్రధమ మహాసభలో భవిష్యత్తు పోరాటాల గురించి చర్చించి కార్యక్రమాల రూపకల్పన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాగర్ కర్నూల్ జిల్లా, 2వ ఏఎన్ఎంల యూనియన్ నాయకులు, కే,మంజుల,,యశోద,ఏ శ్వేత, బి, వసుందర,, జి, నిర్మల, పుష్ప పి, సరళ, తోపాటు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App