Conquer the political classes of the combined district of Karimnagar
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సి.పి.ఐ.(ఎం.ఎల్.) మాస్లైన్ (ప్రజా ప్రంథా) విప్లవ కమ్యూనిస్టు పార్టీగా, అసమానతలు లేని సామాజం కోసం, దేశంలో ఉన్న కార్మిక, కర్షక, మహిళ తదీతర ప్రజా సమస్యల పరిష్కారంకై పోరాడుచున్నది. విద్య, వైద్యం, గృహవసతి, కరెంట్, రోడ్లు, సాగునీరు, త్రాగునీరు, పోడు భూముల సాధనకై ఉద్యమాలను కొనసాగిస్తున్నది. సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం కోసం ఉద్యమిస్తున్నది.
కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక పోరాటాలను నిర్వహిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నది.
ముఖ్యంగా రైతాంగం పండిస్తున్న అన్ని రకాల పంటలకు సరైన మద్దతూ ధరలను కల్పించాలని, రైతుల ఆదాయాన్ని పెంచాలని 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ వర్గాలకు అప్పజెప్పే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకించాలని ప్రజలను చైతన్యవంతం చేస్తూ శక్తి మేరకు ఉద్యమిస్తున్నది.
మణిపూర్ ఆదివాసీల ఊచకోతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులతో
కలిసి రాజ్యాంగం కల్పించిన కనీస ప్రజాస్వామ్య హక్కుల కోసం మోడీ ప్రభుత్వ
ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్నది. ప్రపంచ కుబేరులుగా ఎదిగిన ఆదానీ, అంబానీలకు దేశ సంపదను పూర్తిగా అప్పజెప్పే మోడీ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకవెళ్ళుతూ, ప్రజల్లో పోరాటాలను సిద్ధం చేస్తున్నది.
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ఎలక్ట్రోరల్ బాండ్స్ పేరుతో వేల కోట్ల ముడుపులను కార్పోరేట్ పెట్టుబడిదారి వర్గాల నుండి సమకూర్చుకునే విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుచున్నది.
ఈ జిల్లాలో పెట్టుబడిదారి పాలక వర్గాల దోపిడి విధానాలను రూపుమాపి కష్టజీవుల రాజ్యమైన సోషలిజాన్ని సాధించుటకు గాను అమరులైన కా, యు. రాములు, కా కె. కుమారస్వామి, కా డీ.
మొండన్న, కా॥ మేకల రాజన్న, కా కత్తెరమల్ల పోచన్న,కా బుషిపాక రాజన్నల అమరత్వాన్ని కొనసాగిస్తూ వారి త్యాగాలను ముందుకు తీసుకవెళ్ళవలసిన బాధ్యత అందరిపై ఉన్నది. ఈ క్రమంలోనే రేపు అంతర్జాలం మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App