
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం
మండల పరిధిలోని యర్రగుంట గ్రామ ప్రధాన సెంటర్ నందు గల బస్ స్టాండ్ లో తొలిఅడుగు ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేముల రమణ ,మండల యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాబు కలిసి ప్రయాణానికులుకు మంచి నీళ్ళు మజ్జిగ పోసి చలివేందాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేముల నరేష్ మాట్లాడుతూ వేసవికాలం ప్రయాణికుల దాహం తీర్చేందుకు తొలి అడుగు ఫౌండేషన్ వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని అన్నారు.
అదేవిధంగా మండలంలో ప్రతి గ్రామంలో వేసవికాలం దృష్ట్యా చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొలి అడుగు ఫౌండేషన్ సభ్యులు కాకా గోపాల్, శేఖర్, లాలయ్య, ఆర్ఆర్ ఫార్మసీ సిబ్బంది పార్టీ నాయకులు నున్న బసవయ్య,, రహీం, అక్బర్,ఖాదర్ అనీష్,వేముల కోటేశ్వర్రావు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
