
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేక స్థానం.. మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్ ప్రభుత్వం…
మహిళల అభివృద్ధి కాంగ్రెస్. ధ్యేయమని, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జరుపుల లక్ష్మీ తిరుపతి నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే మహిళలకు ప్రత్యేక స్థానం లభిస్తుందని ఆమె అన్నారు
ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఇచ్చిన హామీలను మహాలక్ష్మి పథకం 500 కే , గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని ఆమె అన్నారు.
మహిళలు ఆర్థికంగా సమాజంలో రాణించేందుకు మహిళ గ్రూపు సంఘాలకు పెద్ద ఎత్తున నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పించి మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.
రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు మహిళలకు అందజేస్తామని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తారని అన్నారు. మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు గ్రామాలలో గడపగడపకు వివరించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు గ్రామ శాఖ నాయకులకు ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
