TRINETHRAM NEWS

వర్గీకరణ తో సహా ఇచ్చిన ప్రతి హామిని నేరేవేర్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్

రంగా రెడ్డి ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి భీం భరత్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు TUFIDC కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్ల నరసింహ రెడ్డి మరియు ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొర్రా జ్ఞానేశ్వర్‌ ఈ దేశం లోనే ఎన్ని కైన సంవత్సరం లోపు ఇచ్చిన ప్రతి హామీని వర్గీకరణతో సహా నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జి భీమ్ భరత్ తెలిపారు.
బుధవారం నాడు బీసీ లకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్, దళిత వర్గీకరణ అమలు నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసి భారీ ర్యాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభి షేకం కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మాటను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కు మరియు గౌరవ మంత్రి మండలి కి తెలంగాణ ప్రజల తరుపున ముఖ్యంగా చేవెళ్ల నియోజక వర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇందుకు సంపూర్ణంగా సహకరించి ప్రోత్సహించిన జాతీయ నాయకత్వానికి ముఖ్యంగా మాజీ ఏఐసీసీ అధ్యక్షులు తమ ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటుగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ , సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి మొయినాబాద్ మండల అధ్యక్షులు మాణయ్యా మాజీ జడ్ పి టీ సి లు ,ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు అన్ని సంఘాల నాయకులు కార్యకర్తలు , మాజీ సర్పంచ్లు , మాజీ ఎం పి టి సి లు , యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress