
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షులు శ్రీ.అర్థ.సుధాకర్ రెడ్డి అన్నారు. బీసీ కులగనన జరిగిన విధానాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని, ఈ సందర్భంగా బుధవారం వికారాబాద్ మున్సిపాలిటీలోని 2వ వార్డు ధన్నారం గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు కమ్మరి.
మాణిక్యం, తెలుగు లక్ష్మయ్య, చిప్పె దశరత్, చిప్పె గోపాల్ లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థ.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం తప్పనిసరిగా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన్నారం లొ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు సంగని జంగయ్య, ఆనంద్, అమర్, న్యామద్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
