Confused Group 2 candidates
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు..
Trinethram News : హైదరాబాద్ : జులై 10
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గళమెత్తుతు న్నారు. మొన్న డీఎస్సీ వాయిదా వేయాలని నిరసనకు దిగారు. కానీ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఇప్పుడు గ్రూప్ 2లో ఒక్క పోస్టు కూడా పెంచే దాఖలా లు కనిపించడం లేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా ప్రభుత్వం మదిలో ఉన్నట్లు లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతవరకు స్పష్టతను కూడా ఇచ్చారు.
నిరుద్యోగులు కోరుతున్నట్లు పరీక్షలు వాయిదా వేసే ఆలోచన కూడా చేయడం లేదని సమాచారం. షెడ్యూ ల్ ప్రకారమే ఆగస్టు 7 ,8 తేదీల్లో పరీక్షలు నిర్వహించ డానికి టీజీపీఎస్సీ అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాల వారీగా పరీక్షకేంద్రా లను గతంలో గుర్తించగా.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ప్రశ్నా పత్రాలతోపాటు పరీక్షల నిర్వహణకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేస్తున్నట్లు టీజీపీఎస్సీ వర్గాలు ద్వారా సమాచారం.
గ్రూపు 2లో 2వేల పోస్టుల సంఖ్యను పెంచుతామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఆ పార్టీ తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App