TRINETHRAM NEWS

Complaint to HYDRA.. Big shock for hero Nagarjuna

Trinethram News : Hyderabad : హీరో నాగర్జునకు బిగ్ షాక్ తగలనుంది. నాగార్జునకు చెందిన N కన్వెన్షన్​పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీలోని తుమ్మిడి చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని జనం కోసం సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించినట్లు ఆ సంస్థ ఆరోపించింది.

29 ఎకరాల 24 గుంటలు ఉన్న తుమ్మిడి చెరువును పునరుద్దరించాలని ఫిర్యాదులో కోరింది. ఈ ఫిర్యాదుపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు పలు సంస్థల అక్రమ నిర్మాణాలను కూల్చిన హైడ్రా.. బడా వ్యక్తుల జోలికి మాత్రం పోలేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడాలి. కాగా గతంలోనూ ఎన్–కన్వెన్షన్​పై విమర్శలు వచ్చాయి. అప్పట్లోనే కూల్చేస్తారనే ప్రచారం జరిగినా.. అది మధ్యలోనే ఆగిపోయింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Complaint to HYDRA.. Big shock for hero Nagarjuna